logo

పాత పింఛను విధానం అమలు చేయాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు.

Published : 05 Dec 2022 05:07 IST

ప్రదర్శనను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ సాబ్జీ

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘10కె రన్‌’ కార్యక్రమాన్ని స్థానిక జడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం జీపీఎస్‌ కాదన్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి ఇప్పటివరకూ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.  కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు శ్యాంబాబు, రవికుమార్‌, నరసింహారావు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని