కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర
ఏలూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు ఆధ్వర్యంలో చేయిచేయి కలుపుదాం.. రాహుల్ గాంధీని బలపరుద్దాం అనే నినాదంతో గురువారం పాదయాత్ర ప్రారంభించారు.
యాత్రలో పాల్గొన్న గురునాథరావు, రామ్మోహనరావు, కార్యకర్తలు
ఏలూరు తూర్పువీధి, న్యూస్‌టుడే: ఏలూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు ఆధ్వర్యంలో చేయిచేయి కలుపుదాం.. రాహుల్ గాంధీని బలపరుద్దాం అనే నినాదంతో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా అగ్రహారంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. పాత బస్టాండు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిస్తున్న సందర్భంగా పీసీసీ పిలుపు మేరకు పాదయాత్ర చేపట్టామన్నారు. మార్చి 26 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో పాల్గొని వారికి మధ్దతు తెలియజేశారు. కార్యక్రమంలో జోడో యాత్ర జిల్లా ఇన్‌ఛార్జి చైతన్య రెడ్డి, నగర ఇన్‌ఛార్జి సత్తిరాజు, కిసాన్ సెల్ ఛైర్మన్ కొమ్మన సాంబశివరావు, మద్దుకూరి బుచ్చిబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
-
India News
Delhi Airport: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ
-
Crime News
Andhra News: అమర్తలూరు పోలీస్ స్టేషన్లో వైకాపా కార్యకర్తల వీరంగం
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసు.. వినయ్ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం