logo

చిన్నారులతో ఇల్లు ప్రారంభం

సొంతిల్లు లేక ఇబ్బంది పడుతున్న వై.వి.లంకకు చెందిన కోనా వెంకట్రావు  దంపతులకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఇల్లు నిర్మించారు.

Published : 06 Feb 2023 05:36 IST

వృద్ధులకు ఆసరాగా నిలిచిన ఎమ్మెల్యే

ఇంటిని ప్రారంభింపజేస్తున్న నిమ్మల

పాలకొల్లు, యలమంచిలి, న్యూస్‌టుడే: సొంతిల్లు లేక ఇబ్బంది పడుతున్న వై.వి.లంకకు చెందిన కోనా వెంకట్రావు  దంపతులకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఇల్లు నిర్మించారు. ఆ ఇంటికి చక్కని రంగులు వేయడంతో పాటు లోపల పైభాగంలో సీలింగ్‌, ఫ్లోరింగ్‌కు టైల్స్‌తో తుది మెరుగులు దిద్దారు. ఆదివారం ఎమ్మెల్యే రామానాయుడు దగ్గరుండి ఆ వృద్ధులతో పాటు వారి మనుమలైన గణేష్‌, తేజస్విలతో ప్రారంభోత్సవం చేయించారు. ఇంటి నిర్మాణంలో భాగస్వాములైన స్థానికులు, తాపీమేస్త్రీలను ఎమ్మెల్యే సత్కరించారు. స్థానిక సర్పంచి ఈదా ప్రమీల, తెదేపా నాయకులు నార్ని సత్తిబాబు, ముచ్చర్ల శ్రీనివాస్‌, గుబ్బల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని