logo

CrimeNews: పెళ్లి చేసుకుంటానని జూనియర్‌ ఆర్టిస్ట్‌పై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూనియర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌ అయిన యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 18 Feb 2023 08:18 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూనియర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌ అయిన యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి(29)కి 2021లో గుంటూరు జిల్లా కాకాని ప్రాంతానికి చెందిన రోహిత్‌ఖాన్‌(24) పరిచయమయ్యాడు. ఆమె 2021 సెప్టెంబరులో నగరానికి వచ్చి జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ బోరబండలో ఉంటోంది. ఆ యువతి ఫోన్‌ నంబరు సంపాదించిన రోహిత్‌ఖాన్‌ తరచూ ఆమెకు ఫోన్‌ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకొమ్మని బాధితురాలు పలుమార్లు కోరినా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు  చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని