logo

సొంతింట్లో ఉగాది లేనట్లే!

పాలకొల్లుకు చెందిన టిడ్కో ఇంటి లబ్ధిదారు ఎ.సత్యవతి  26వ వార్డులో అద్దెకు ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్తే తిన్నా తినకపోయినా గడిచిపోతుందని భావించారు.

Updated : 11 Mar 2023 05:50 IST

ఏళ్లవుతున్నా పూర్తికానిటిడ్కో గృహాలు
పాలకొల్లు, న్యూస్‌టుడే

పాలకొల్లులో పూర్తికాని ఇళ్లు

పాలకొల్లుకు చెందిన టిడ్కో ఇంటి లబ్ధిదారు ఎ.సత్యవతి  26వ వార్డులో అద్దెకు ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్తే తిన్నా తినకపోయినా గడిచిపోతుందని భావించారు. మూడేళ్లుగా అదిగో ఇదిగో అని చెప్పడం మినహా నేటికీ సొంతింటి యోగం కలగలేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఒక్క సత్యవతే కాదు పట్టణంలో రూ.వేలకు వేలు అద్దె చెల్లించి పరాయి పంచన ఉంటున్న అనేక మంది లబ్ధిదారుల వ్యధ ఇది.

ఉమ్మడి జిల్లాలోని టిడ్కో సముదాయాల్లో నిర్మాణాల ప్రగతిని పరిశీలిస్తే సొంతింట్లో ఉగాది పచ్చడి తినేది ఎన్నేళ్లకో అన్నట్లు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలలుగా పరిశీలిస్తే వందకు వంద శాతం పూర్తయిన ఇళ్లు స్పల్పమేని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తవగా.. ఈ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా మిగిలిన పనులు పూర్తిచేయకపోవడం లబ్ధిదారులకు శాపంగా మారింది. మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో మొదటి విడతలో, జంగారెడ్డిగూడెంలో రెండో విడతలో చేపట్టిన ఈ బహుళ అంతస్తుల్లో గృహయోగం కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు.

గోడలు, పైపుల నుంచి లీకులు ఇలా

నాణ్యత లేని  పైపులతో..

గృహ ప్రవేశం చేయని వారి ఆవేదన ఒకలా ఉంటే.. ఇళ్లలోకి వెళ్లిన వారి ఆందోళన మరోలా ఉంది. గృహాలకు నీటిని సరఫరా చేసే పైపుల నాణ్యతలోని డొల్లతనం బయటపడుతోంది. ట్యాంకుల నుంచి మరుగుదొడ్లలోకి నీరొస్తున్నప్పుడు పైపులు లీకవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ కారణంగా శ్లాబ్‌ గోడల నుంచి నీరు కారుతూ విద్యుత్తు బోర్డుల్లోకి చేరుతోందని చెబుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత సిబ్బందికి తెలియజేస్తే మక్కు పెట్టి రంగు వేశారని.. అది కూడా నిరుపయోగంగా మారిందని సత్యనారాయణ అనే లబ్ధిదారు వాపోయారు.


మరమ్మతులు చేయిస్తాం

వందలాది ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నప్పుడు ప్లంబింగ్‌ పనుల్లో చిన్న చిన్న లీకులు వస్తుంటాయి. స్థానికంగా ఉన్న ఏఈలను కలిస్తే మరమ్మతులు చేయిస్తారు. గణాంకాల పరంగా ప్రగతి కనిపించకపోవడానికి వంద శాతం పూర్తయిన ఇళ్లను మాత్రమే లెక్కల్లోకి తీసుకోవడమే కారణం. జంగారెడ్డిగూడెం పట్టణం రెండో విడతలో ఉన్నందున  అక్కడ త్వరలో పనులు ప్రారంభమవుతాయి. మొదటి విడతలో ఇళ్లన్నీ పూర్తిచేసి రెండో విడతకు వెళ్తే బాగుంటుందనేది ఆలోచన. 

స్వామినాయుడు, ఈఈ, టిడ్కో గృహ సముదాయాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని