logo

Eluru: మహిళా కానిస్టేబుల్‌పై జులుం.. చేయిచేసుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌

సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్‌ పోలీసు దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నాడు.

Updated : 04 Aug 2023 10:04 IST

ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్‌ పోలీసు దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు పాతబస్టాండు కూడలిలో గురువారం చోటుచేసుకుంది. నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ పాతబస్టాండు కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ తన స్నేహితురాలిని స్కూటీపై ఎక్కించుకుని వస్తుండగా ఆపాడు. తాను కానిస్టేబుల్‌నని చెప్పినా వినకుండా ఐడీ కార్డు చూపించమని దురుసుగా ప్రవర్తిస్తూ.. బండి తాళాలు లాక్కున్నాడు. ఆమె అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుండగానే చేయి చేసుకున్నాడు. ఆమె నోటి వెంట రక్తం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బాధితురాలు గతంలో ఏలూరు సబ్‌ డివిజన్లో పని చేశారు. తరువాత బదిలీపై తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. మహిళపై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దాడికి పాల్పడటంతో స్థానికులు అక్కడ గుమిగూడారు. ఈలోగా ఆమె  సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం పెద్దది కాకుండా కొంతమంది అధికారులు సర్దుబాటు చేశారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను పిలిపించి మందలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని