logo

రావాలంటూ ప్రలోభాలు.. ఒత్తిళ్లు

సిద్ధం సభకు ఎలాగైనా జన సమీకరణ చేయాలన్న ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు ఆదేశంతో మండల నాయకులు ప్రలోభాల గాలం వేసి తరలించారు.

Published : 17 Apr 2024 06:25 IST

బస్సులో జనం తరలింపు

పోడూరు, న్యూస్‌టుడే: సిద్ధం సభకు ఎలాగైనా జన సమీకరణ చేయాలన్న ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు ఆదేశంతో మండల నాయకులు ప్రలోభాల గాలం వేసి తరలించారు. మంగళవారం భీమవరంలో బహిరంగ సభకు వస్తే రూ.500, మద్యం, రెండు పూటలా బిర్యానీ ఇస్తామంటూ సమీకరణ చేశారు. గ్రామ జనాభాను బట్టి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. రావులపాలెం, కొవ్వూరు, కాకినాడ, ఏలేశ్వరం, తణుకు డిపోల నుంచి బస్సులు ఉదయమే ఆయా గ్రామాలకు చేరుకోగా, మధ్యాహ్నం నుంచి బయలుదేరాయి. పెనుగొండ మండలంలో బస్సుకు రూ.10 వేల చొప్పున అందజేసినట్లు తెలిసింది. అయితే రెండు రోజుల ముందు నుంచే వైకాపా శ్రేణులు, గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రైవేట్‌ సైన్యమైన గృహసారథులు, కన్వీనర్లు ఎవరెవరు సభకు వస్తున్నారంటూ కసరత్తు చేశారు. బస్సు ఎక్కగానే నగదు, మద్యం, రెండు పూటలా బిర్యానీలు ఇస్తామంటూ ప్రచారం చేశారు.  

పథకాలు నిలిపేస్తాం.. సిద్ధం సభకు ఆచంట నియోజకవర్గం నుంచి 200 పైగా బస్సుల్లో జనాలను తరలించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మండల నాయకులు ఒత్తిళ్లకు పాల్పడ్డారు. పింఛను, రేషన్‌కార్డు, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాల లబ్ధిదారులు తప్పనిసరిగా రావాలంటూ హుకుం జారీ చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని, సభకు రాకుంటే పథకాలు నిలిపివేస్తామంటూ రాజీనామా చేసిన వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడటంతోపాటు నగదు, మద్యం, బిర్యానీ గాలం వేసి జనాన్ని తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని