విధినే ఎదిరించే..విజయ శిఖరమే తలవంచే!
నాకు చదువులో బొటాబొటీ మార్కులే వచ్చేవి. ఇంటర్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. ఆ రోజుల్లో బీఎస్సీలో సీటురావడం కూడా కష్టమైంది. నేను పెద్దగా చదవనని చాలా మంది హేళన చేసేవారు. ఓ మిత్రుడు సివిల్స్ వైపు దృష్టిపెడితే ఎలా ఉంటుందో చెప్పారో..
వెంటాడిన పేదరికం
అయినా.. సివిల్స్ సాధనే ధ్యేయంగా కృషి
ఈనాడు, విశాఖపట్నం, తణుకు, న్యూస్‌టుడే
కారణం 1...
నాకు చదువులో బొటాబొటీ మార్కులే వచ్చేవి. ఇంటర్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. ఆ రోజుల్లో బీఎస్సీలో సీటురావడం కూడా కష్టమైంది. నేను పెద్దగా చదవనని చాలా మంది హేళన చేసేవారు. ఓ మిత్రుడు సివిల్స్ వైపు దృష్టిపెడితే ఎలా ఉంటుందో చెప్పారో.. ఆ రోజే ఆ దిశగా నా ఆలోచన ఆరంభమయింది.
కారణం 2...
ఎన్నో కష్టాలు దాటుకొని డీఎస్పీగా ఎంపికైన తరువాత క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం విజయవాడ వెళ్లా. ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఒక ౖఉన్నతాధికారి నాతోపాటు వచ్చిన ఇద్దరు శిక్షణ ఐ.పి.ఎస్.లను భోజనానికి పిలిచారు. నన్ను మాత్రం పిలవలేదు. నాకు తలకొట్టేసినట్లైంది. ఆ రోజే సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న పట్టుదల మరింత పెరిగింది.
ఒకప్పుడు కటిక పేదరికం. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులెన్నో. కానీ, ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నత హోదాలో ఉన్నారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరిన జి. హరిప్రసాదరాజు జీవన ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆసక్తికరమే. అవేంటో.. విశాఖ వచ్చిన ఆయన మాటల్లోనే.
ఏడుగురు బిడ్డలం..
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మా స్వస్థలం. నా తండ్రి జి.వి.రాజు విజయవాడలో సంస్కృతం బోధిస్తూ, వయోలిన్ వాయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మా తల్లి తులశమ్మ గృహిణి.
మేం ఏడుగురు పిల్లలం (నలుగురు ఆడ, ముగ్గురు మగ) కావడంతో డబ్బులకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాన్న సంపాదన ఏమాత్రం సరిపోయేదికాదు. చేదోడుగా ఉండాలని అమ్మ చిన్న చిల్లరకొట్టు నిర్వహించేవారు. ఆర్థికంగా కష్టాలున్నా చదువువిలువ చెప్పి ముందుకు నడిపారు. పెద్దన్నయ్య జి.ఎస్.పి.రాజు ఎంబీబీఎస్, చిన్న అన్నయ్య జి.ఎస్.రాజు బీటెక్‌లో చేరడంతో..ఇంటర్లో నామీద తీవ్రమైన ఒత్తిడి ఉండేది. నేనేమో సగటు విద్యార్థిని.
అలా సీటొచ్చింది...
ఇంటర్ తరువాత చాలా కాలేజీలకు దరఖాస్తు చేశా. గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ జియాలజీలో సీటు వచ్చింది. అప్పట్లో ఆ కోర్సు కొత్తగా పెట్టారు. సీట్లు మిగిలి నాకు అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో నా మిత్రుడు మన్నవ నాగేశ్వరరావు సివిల్స్‌లో ర్యాంకు సాధిస్తే జీవితానికి తిరుగుండదని చెప్పేవారు. డిగ్రీలో సీటు రావడమే కష్టమైన నాకు సివిల్స్ గురించి ఆలోచించడం అతిశయోక్తిగా అనిపించింది. కానీ, నన్ను హేళన చేసిన వారికి నేనేంటో నిరూపించాలన్న పట్టుదల పెరిగింది. డిగ్రీలో 80.8 శాతం మార్కులు సాధించా.
ఉద్యోగాన్ని కాదనుకున్నా..
పీజీ పూర్తికాగానే ప్రభుత్వ ‘అటామిక్ మినరల్స్’ డివిజన్లో ఉద్యోగమిస్తామని పిలిచి.. ఇంటర్వ్యూలో నా లక్ష్యం ఏమిటని అడగ్గా... సివిల్స్‌కు సాధన చేస్తున్నానని చెప్ఫా ‘ఉద్యోగం తప్పకుండా ఇస్తాం. కానీ, సివిల్స్ సాధనకు అవకాశం ఉండదు. క్యాంపులకు వెళ్లాల్సి ఉంటుంది. నీ లక్ష్యాన్ని మరచిపోవాలి. ఆలోచించుకుని చెప్పు’ అన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాకు ఆ ఉద్యోగం చాలా అవసరం. కానీ సివిల్స్ లక్ష్యం గుర్తొచ్చి ఉద్యోగం వద్దని చెప్ఫా
విశాఖలో ట్యూషన్లు చెప్పా..
ఉద్యోగం వద్దనుకున్న తరువాత విశాఖలోనే ట్యూషన్లు చెబుతూ వచ్చే కొద్దిపాటి మొత్తంతో గడిపాను. అదే సమయంలో సివిల్స్‌కు సిద్ధమయ్యా. 1988లో తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా విజయం సాధించలేకపోయా. తీవ్ర నిరాశ ఆవహించింది. ఆ మరుసటి సంవత్సరం ఏపీపీఎస్సీ పరీక్షలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించా. అప్పటికే ఒక ఉద్యోగం వదిలేసిన నన్ను.. ఇందులో చేరాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. ఇదీ కీలకమైనదే కావడంతో చేరా.
అస్వస్థత నేపథ్యంలో..
డీఎస్పీగా శిక్షణ పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యా. ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సివిల్స్‌కు సాధన చేశా. జాతీయస్థాయిలో 65వ ర్యాంకు వచ్చింది. ఐ.ఎ.ఎస్. వచ్చే అవకాశం ఉన్నా ఐ.పి.ఎస్.నే ఎంచుకున్నా. అసోం, మేఘాలయ కేడర్ వచ్చింది. 1993 బ్యాచ్ ఐ.పి.ఎస్.గా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి, పదోన్నతులు పొంది ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నా. ప్రజలకు మరింతగా సేవ చేయాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితో డిప్యుటేషన్‌పై పశుసంవర్థక, కార్మిక, సహకారశాఖల ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నా. నా భార్య అనిత స్వస్థలం విశాఖే. నా కుటుంబసభ్యులతోపాటు ఆమె ఇచ్చిన సహకారం మరువలేను.
అలా.. ఏయూలో...
డిగ్రీ తరువాత ఏయూ జియాలజీ విభాగంలో ఎమ్మెస్సీ (టెక్) పూర్తి చేశా. అత్యుత్తమ మార్కులతో బంగారుపతకం కూడా సాధించా. పెద్దన్నయ్య ఎండీ, చిన్నన్నయ్య ఎంటెక్ చేస్తూ వారికి వచ్చే ఉపకారవేతనం నుంచి కొంత నాకు పంపేవారు. మిత్రులు కూడా ఆర్థిక సాయం చేస్తుండేవారు. అలా ఆర్థికంగా అండగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్‌కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్‌ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్