logo

రూ.10 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజావృద్ధి సంస్థలను విస్తరింపజేయడం ద్వారా ఏడాదికి రూ.10 వేల కోట్లు ఆదాయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు.

Published : 23 Mar 2023 04:49 IST

మంగంపేట ముగ్గురాయికి మంచి గిరాకీ : ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి

మాట్లాడుతున్న ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ఖనిజావృద్ధి సంస్థలను విస్తరింపజేయడం ద్వారా ఏడాదికి రూ.10 వేల కోట్లు ఆదాయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. మంగంపేట ఏపీఎండీసీ అతిథిగృహంలో బుధవారం ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మంగంపేట ముగ్గురాయికి మంచి గిరాకీ ఉందని, గతేడాది మూడు మిలియన్‌ టన్నుల ఖనిజం విక్రయించడం ద్వారా రూ.1,200 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది 5 మిలియన్‌ టన్నుల ఖనిజాన్ని వెలికి తీస్తామని, మరో ఆరేళ్లల్లో ఖనిజ తవ్వకం పనులు పూర్తవుతాయని వివరించారు. సంస్థకు వస్తున్న ఆదాయంలో ఏడాదికి రూ.20 కోట్లు సీఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేస్తున్నామని, ఏపీఎండీసీ పాఠశాలలో వచ్చే ఏడాది నుంచి ఉచిత భోజనం వసతి అమలు చేస్తామని తెలిపారు. దీంతోపాటు 8వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడంతోపాటు పాఠశాలకు అవసరమైన అదనపు గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలను మే చివరి నాటికి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే ఆర్‌ఆర్‌-5 గ్రామంలో జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంతోపాటు మంగంపేట గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ఆయనవెంట అధికారులు డి.వి.రమణ, బెనర్జీ, చలపతి, రమణ, తదితరులున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని