logo

ఇదీ పది పరీక్షల తీరు!

పదో తరగతి పరీక్షలు మొదలైన నేపథ్యంలో తొలిరోజే పరీక్షలు రాసే విద్యార్థులకు చీటీలు అందించేందుకు కొందరు యువకులు పడరానిపాట్లు పడ్డారు. గోడలు ఎక్కి మొదటి అంతస్థులో పరీక్ష రాస్తున్న తమ వారికి చిట్టీలు అందించేందుకు యత్నించారు.

Updated : 19 Mar 2024 09:40 IST

ఖాజీపేటలోని ఏపీ మోడల్‌ పాఠశాలలో మొదటి అంతస్తులో చీటీలు వేసేందుకు ప్రయత్నిస్తున్న యువకులు

పదో తరగతి పరీక్షలు మొదలైన నేపథ్యంలో తొలిరోజే పరీక్షలు రాసే విద్యార్థులకు చీటీలు అందించేందుకు కొందరు యువకులు పడరానిపాట్లు పడ్డారు. గోడలు ఎక్కి మొదటి అంతస్థులో పరీక్ష రాస్తున్న తమ వారికి చిట్టీలు అందించేందుకు యత్నించారు. ఖాజీపేట మండలం కేంద్రంలోని ఏపీ మోడల్‌ పాఠశాల పరీక్ష కేంద్రంలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు తెలుగు పరీక్ష జరిగింది. పరీక్ష మొదలైన గంట తర్వాత కొందరు యువకులు పాఠశాల ప్రహరీ ఎక్కి ఆవలికి దూకి కిటికీలు పట్టుకువేళాడుతూ మొదటి అంతస్థులోని తమ వారికి చీటీలు అందించే ప్రయత్నం చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడంతో యువకులు కిటికీలు పట్టుకునిపై అంతస్థుకు చేరుకుని చీటీలు అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ రామాంజులు అక్కడకు చేరుకోవడంతో వారు పరారయ్యారు.

న్యూస్‌టుడే, ఖాజీపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని