logo

‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి ఆరోపించారు.

Published : 28 Mar 2024 03:49 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి

మారుతీనగర్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక రాష్ట్ర కార్యాలయంలో బుధవారం భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను గారడితో మాయ చేస్తున్న వీరందరి భవితవ్యం త్వరలోనే తేలనుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగానే ఎడారిగాలో మార్చారని విమర్శించారు. వలసలు, ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలు, నీటిప్రాజెక్టులు, ఉక్కుపరిశ్రమ, రైల్వేమార్గాలను విస్మరించడంలో ఎవరికి వారే సాటి అని దుయ్యబట్టారు. శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి నాగన్న, పార్టీ సీనియర్‌ నాయకులు లింగమూర్తి, రాయలసీ జిల్లాల ప్రతినిధులు మగ్బుల్‌బాషా, ప్రసాద్‌, తస్లీం, లక్ష్మిదేవి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని