logo

‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’

శామాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు

Updated : 29 Mar 2024 06:21 IST

 మాట్లాడుతున్న నంద్యాల వరదరాజులరెడ్డి, పక్కన నాయకులు
ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: శామాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు. స్థానిక నెహ్రూరోడ్డులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ నిస్సిగ్గుగా చంద్రబాబునాయుడు, వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. వివేకా హత్య కేసు దోషులను చంద్రబాబు వెంట పెట్టుకుని తిరుగుతున్నారని జగన్‌ సభలో చెప్పడం దుర్మార్గమన్నారు. ఆ కేసులో దోషిగా ఉన్న కడప ఎంపీ  అవినాష్‌రెడ్డిని పక్కనే పెట్టుకుని సభలో జగన్‌ మాట్లాడారన్నారు. అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా అయిదేళ్ల పాటు జగన్‌ తన సర్వశక్తులు వడ్డారని, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వద్ద మోకరిల్లారని ఆరోపించారు. వివేకాను హత్య చేసిన వ్యక్తులు జగన్‌, భారతిరెడ్డికి ముందే తెలుసని అందుకే సీబీఐ విచారణను జగన్‌ ఉపసంహరించుకున్నారని ఆరోపించారు.

ప్రొద్దుటూరులో జగన్‌ సభ విఫలం : ప్రొద్దుటూరులో జరిగిన సీఎం జగన్‌ సభ ఘోర విఫలమైందని వరదరాజులురెడ్డి తెలిపారు. సభ ప్రారంభం కాకముందే జనం ఇంటిబాట పట్టారన్నారు. జగన్‌, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకోలేదన్నారు.  జగన్‌ ఆర్థిక నేరస్థుడని, రూ.43 వేల కోట్లు దోచేసి జైలుకెళ్లడంతో ఆయనను ఏ నాయకుడూ నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం జగన్‌, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఇద్దరూ దుర్మార్గులే అన్నారు. ప్రభుత్వ లిక్కర్‌ కంపెనీలు వైకాపావి కావడంతో ఆదాయం లేకుండా తక్కువ రేటుతో నేరుగా ఎమ్మెల్యే రాచమల్లుకు చేరుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలవడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పురపాలక మాజీ ఛైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, నాయకులు ఘంటశాల వెంకటేశ్వర్లు, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు