logo

జగన్‌ దంపతులకు తెలియకుండా వివేకా హత్య జరిగి ఉండదు

సీఎం జగన్‌ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 18 Apr 2024 04:20 IST

భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆ రోజు తనపై నింద మోపారన్నారు. ఇటీవల కమలాపురంలో జరిగిన సమావేశంలో ఆ ఎమ్యెల్యే మాట్లాడుతూ హత్య చేసింది గంగిరెడ్డి అయితే అవినాష్‌రెడ్డి చూస్తూ ఉన్నారంటే తనకూ ఈ హత్యకు సంబంధం లేదనే కదా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేయని తప్పే లేదని విమర్శించారు. ఆయన ప్రచారం పేరిట పల్లెలు తిరిగేది అక్కడున్న సహజ వనరులను దోచుకునేందుకు, భూ కబ్జాలకు పాల్పడేందుకేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలను గెలవ నుందన్నారు. తాను జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై మాట్లాడుతూ ఇప్పటికే కొంత మంది వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, సక్రమంగా ఉండక పోతే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని, రాజోలి జలాశయం నిర్వాసితులకు రూ.12.50 లక్షలకు బదులుగా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని