icon icon icon
icon icon icon

Andhra news: కొడాలి నాని, బుగ్గన నామినేషన్లకు ఆమోదం

గుడివాడ, డోన్‌ వైకాపా అభ్యర్థుల నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు.

Published : 26 Apr 2024 19:14 IST

అమరావతి: గుడివాడ, డోన్‌ వైకాపా అభ్యర్థుల నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు. కొడాలి నామినేషన్‌పై సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి, నామినేషన్‌ను ఆమోదించినట్టు ఆర్వో తెలపడంతో వైకాపా నేతలు ఊపిరిపీల్చుకున్నారు. 

నంద్యాల జిల్లా డోన్‌ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌పై తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గన నామినేషన్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. తర్జన భర్జన అనంతరం సాయంత్రానికి నామినేషన్‌ ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img