icon icon icon
icon icon icon

Nara Lokesh: పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్

పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు.

Published : 06 May 2024 10:33 IST

అమరావతి: పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో గర్భిణిపై వైకాపా నేతల దాడిని ఆయన ఖండించారు. తాగునీరు అడగటమే ఆమె చేసిన పాప‌మా అని ప్రశ్నించారు. నిండు గ‌ర్భిణి అని చూడ‌కుండా అమాన‌వీయ దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ సాగించిన అరాచ‌కాలకు ప్రజా క్షేత్రంలో దోషులుగా నిల‌వ‌క త‌ప్పదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం చేస్తుండగా బాధిత మహిళ తాగునీటి సమస్యపై నిల‌దీసింద‌ని తెలిపారు. దీంతో నిండు గ‌ర్భిణిపై వైకాపా నేతలు దాడులు చేశారని వివరించారు. ‘‘పెద్దిరెడ్డీ!.. మీ పాపాల‌కు త‌గిన శిక్ష మే 13న జ‌నం విధిస్తారు’’ అని లోకేశ్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img