icon icon icon
icon icon icon

నేడు రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ సభలు

రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు.

Updated : 06 May 2024 07:11 IST

షెడ్యూల్‌కంటే ముందే చేరుకోనున్న ప్రధాని
రాజమహేంద్రవరంలో పాల్గొననున్న పవన్‌, లోకేశ్‌
అనకాపల్లి సభకు హాజరు కానున్న చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడింటినుంచి 3.45 గంటల వరకు సభ జరగనుంది. తొలుత నిర్ణయించిన సమయంకంటే మోదీ అరగంట ముందే రానున్నారు. ఇక్కడినుంచి ఆయన వెంటనే అనకాపల్లి వెళ్లాల్సి ఉండటంతో సూర్యాస్తమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేశారు. రాజమహేంద్రవరం సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశమార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమహేంద్రవరం సభలో పాల్గొనడానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబునాయుడు హాజరవుతారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొనే అవకాశముంది. రాజమహేంద్రవరంలో సభావేదికపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు ఐదుగురు లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థులు, రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి 31 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు లక్షల మంది సభకు హాజరవుతారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త సాగి కాశీవిశ్వనాథరాజు వెల్లడించారు. సుమారు 70 వేల కుర్చీలు, ఎండల తీవ్రత దృష్ట్యా జర్మన్‌ హ్యాంగర్లు, 200 ఏసీ కూలర్లను ఏర్పాటుచేశారు. తెదేపా ఎన్డీయేలో చేరాక ప్రధాని మోదీ పాల్గొంటున్న సభలు ఇవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img