icon icon icon
icon icon icon

‘రాష్ట్రంలో నిరసన తెలిపే పరిస్థితి లేకుండా పోయింది’

‘కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి దిగజారింది. హక్కుల సాధన, న్యాయమైన డిమాండ్ల కోసం నిరసనలు చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.

Published : 06 May 2024 05:57 IST

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: ‘కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి దిగజారింది. హక్కుల సాధన, న్యాయమైన డిమాండ్ల కోసం నిరసనలు చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులో ఐక్యవేదిక జిల్లా ఛైర్మన్‌ చాంద్‌బాషా అధ్యక్షతన సదస్సు జరిగింది. సూర్యనారాయణ మాట్లాడుతూ.. రానున్న ఆరునెలల కాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెందిన 12 సమస్యలపై ఆయా వర్గాలను సమీకరించి పోరాట కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. సీపీఎస్‌, పీఆర్‌సీ సమస్యలతోపాటు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాంట్రాక్టు, కంటింజెంట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాల చెల్లింపు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, అడిషినల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ చెల్లింపు, ఆరోగ్య పథకం పక్కాగా అమలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్‌ రూపొందించి అమలు చేయడం, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబెషన్‌ డిక్లరేషన్‌లో జాప్యం నేపథ్యంలో జీతాల బకాయిల చెల్లింపు, ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీని విలీనం చేశాక ఉద్యోగుల సమస్యలు తదితర అంశాల పరిష్కారమై కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి సమయం తక్కువగా ఉన్నందున ఈనెల 11వ తేదీ వరకు గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐక్యవేదిక రాష్ట్ర కో.ఛైర్మన్‌ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్‌ బాజీ పఠాన్‌, ఉపాధ్యక్షులు కేదారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img