icon icon icon
icon icon icon

వైకాపా కుయుక్తులు.. గ్లాస్‌ గుర్తు, పవన్‌ చిత్రంతో ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి ప్రచారం

ప్రజాకర్షణ తగ్గిపోయి ఓటమి భయం పట్టుకున్న వైకాపా.. ఎన్డీయే కూటమిని ఓడించేందుకు తాజాగా సరికొత్త కుట్రకు తెర తీసింది.

Updated : 06 May 2024 07:28 IST

అడ్డుకున్న జన సైనికులు, ఆర్వోకు ఫిర్యాదు

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : ప్రజాకర్షణ తగ్గిపోయి ఓటమి భయం పట్టుకున్న వైకాపా.. ఎన్డీయే కూటమిని ఓడించేందుకు తాజాగా సరికొత్త కుట్రకు తెర తీసింది. జనసేన, తెదేపా, భాజపా పొత్తుల్లో భాగంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పోటీలో ఉండటంతో.. జనసేన గుర్తు ‘గాజు గ్లాసు’ను ఫ్రీ సింబల్‌ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్‌కు ఆ గుర్తును కేటాయించారు. గాజు గ్లాసు గుర్తుతో ప్రచారం చేసుకోవాల్సిన ఫణిరాజ్‌.. ప్రచార వాహనాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చిత్రం కూడా ముద్రించి, ప్రచారం చేస్తుండడం వివాదాస్పదమైంది. దీన్ని గుర్తించిన పవన్‌ అభిమానులు, జన సైనికులు సదరు ప్రచార వాహనాలను అడ్డుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ చిత్రాన్ని ప్రచార వాహనాలపై ఎందుకు ముద్రించారని ప్రశ్నించారు. సదరు అభ్యర్థి ఫణిరాజ్‌ సరైన సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు. ఈ క్రమంలో మారుతీనగర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై సెంట్రల్‌ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, జన సైనికులు నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్డీయే కూటమి అభ్యర్థి మెజార్టీ తగ్గించేందుకే ఈ కుట్ర పన్నారని చెప్పారు. ఫణిరాజ్‌పై కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. వైకాపా ప్రోద్బలంతోనే తమ నాయకుడి ఫొటోలతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img