icon icon icon
icon icon icon

Rajnath Singh: ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు.

Published : 24 Apr 2024 18:03 IST

విశాఖపట్నం: ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి భరత్‌, ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు.

‘‘వైకాపా ప్రభుత్వం మొత్తం రూ. 13.50లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.2లక్షల రుణభారం మోపింది. ఖాజానా ఖాళీ చేసి పన్నుల భారం ప్రజల మీద వేసింది. రాష్ట్రాన్ని, విశాఖను డ్రగ్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌గా మార్చింది. ల్యాండ్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, మైనింగ్‌ మాఫియాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పూర్తిగా కూరుకుపోయింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధికి భరోసా కల్పిస్తుంది. కాంగ్రెస్‌ విస్మరించిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగువారిపై ఉన్న గౌరవాన్ని ఎన్డీయే ప్రభుత్వం చాటి చెప్పింది. వచ్చే ఐదేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతాం’’అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img