icon icon icon
icon icon icon

AP Election Voter Turnout: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు - జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఎంతంటే?

AP Elections Voter Turnout: ఏపీ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు శాతం, జిల్లాల వారీగా పోలింగ్‌ వివరాలు మీ కోసం... 

Updated : 15 May 2024 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తుది పోలింగ్‌ శాతం వివరాలను ఆయన ప్రకటించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభలో 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సీఈవో చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్ల శాతం, జిల్లాల వారీగా పోలింగ్‌ వివరాల (Voter Turnout) జాబితా మీ కోసం...


జిల్లాల వారీగా  ఇలా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img