icon icon icon
icon icon icon

నిర్మించడం చేతకాని ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిది?: చంద్రబాబు

పేదల ఇళ్లను నిర్మించి ఇవ్వడం చేతకాని వైకాపా ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిదని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 23 Apr 2024 07:13 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పేదల ఇళ్లను నిర్మించి ఇవ్వడం చేతకాని వైకాపా ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిదని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతను ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడినా.. మీ కూల్చివేత సంస్కృతిని మార్చుకోరా? వ్యవస్థల్ని, రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చిన మీ ప్రభుత్వాన్ని మే 13న ప్రజలు కూల్చబోతున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img