icon icon icon
icon icon icon

పేదల బియ్యం దోచుకున్న జగన్‌

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంచాల్సిన బియ్యాన్నీ సీఎం జగన్‌ దోచుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆయన తండ్రి,

Updated : 23 Apr 2024 07:13 IST

ద్వారంపూడి ద్వారా వ్యవహారం నడుపుతున్నారు
ఎన్డీయే నేతలు శ్రీనివాసరెడ్డి, శివశంకర్‌, దినకర్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంచాల్సిన బియ్యాన్నీ సీఎం జగన్‌ దోచుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆయన తండ్రి, ఏపీ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ భాస్కరరెడ్డి ద్వారా జగన్‌ మొత్తం తతంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లతో కుమ్మక్కై కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం తరలిస్తున్నారని విమర్శించారు. పేదలకు దక్కాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విలేకరులతో మాట్లాడారు. 2018-19లో కాకినాడ పోర్టు నుంచి 18 లక్షల మె.టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అయితే... 2020-21నాటికి అది 31 లక్షల మె.టన్నులకు చేరిందంటేనే దోపిడీ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చని శివశంకర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img