icon icon icon
icon icon icon

ఈసారి మీకు ఓట్లు వెయ్యం

‘ఉదయగిరి వెళ్లే రోడ్డు చూశారా.. ఎంత అధ్వానంగా ఉంది.. ఒక్కసారైనా బాగు చేయాలనిపించలేదా.. మా ఇబ్బందులను పట్టించుకోని మీకు ఈ ఎన్నికల్లో ఓట్లు వెయ్యం’ అని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లి గ్రామస్థులు.

Updated : 23 Apr 2024 07:11 IST

వైకాపా నేత రాజమోహన్‌రెడ్డికి తేల్చిచెప్పిన పోలిరెడ్డిపల్లి వాసులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ‘ఉదయగిరి వెళ్లే రోడ్డు చూశారా.. ఎంత అధ్వానంగా ఉంది.. ఒక్కసారైనా బాగు చేయాలనిపించలేదా.. మా ఇబ్బందులను పట్టించుకోని మీకు ఈ ఎన్నికల్లో ఓట్లు వెయ్యం’ అని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పోలిరెడ్డిపల్లి గ్రామస్థులు.. వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి తేల్చి చెప్పారు. సోమవారం రాత్రి చినమాసునూరు పంచాయతీ పోలిరెడ్డిపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి వెళ్లిన మేకపాటికి తీవ్ర నిరసన ఎదురైంది. వైకాపా హయాంలో రహదారుల అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేదంటూ గ్రామస్థులు నిలదీశారు. అంతకుముందు కదిరినేనిపల్లి గ్రామానికి వెళ్లగా.. ‘తాగునీరు రావడం లేదు. రోడ్లు, పక్కా గృహాలు నిర్మించలేదు. భూ పంపిణీ చేయలేదు’ అంటూ వారూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img