icon icon icon
icon icon icon

వైకాపా అభ్యర్థికి చేదు అనుభవం: ర్యాలీ ఆలస్యం.. మించిపోయిన నామినేషన్‌ సమయం!

గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ర్యాలీలో జరిగిన జాప్యంతో ఆయన నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు.

Updated : 24 Apr 2024 07:47 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ర్యాలీలో జరిగిన జాప్యంతో ఆయన నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. అంబటి మురళీకృష్ణ మంగళవారం పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఉదయం 7.30 గంటలకు ర్యాలీని ప్రారంభించారు. పెదకాకాని, నారాకోడూరు, చేబ్రోలు, మంచాల, వెల్లలూరు, మునిపల్లె, పచ్చలతాడిపర్రు, పొన్నూరు పట్టణ పరిధిలోని పురపాలక సంఘ కార్యాలయానికి మధ్యాహ్నం 3.10 గంటలకు చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు మూడు గంటల లోపు వచ్చిన వారి నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. సమయం దాటిపోవడంతో మురళీకృష్ణ నామినేషన్‌ వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిపై నుంచే వైకాపా నేతలు ప్రసంగించారు. గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాల్లోని చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img