icon icon icon
icon icon icon

కుప్పంలో జనసమీకరణకు వైకాపా ఆపసోపాలు.. తమిళులతో బేరాలు

వై నాట్‌ కుప్పం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైకాపా నాయకులు.. ఆ పార్టీ అభ్యర్థి భరత్‌ నామపత్రాల దాఖలు ర్యాలీకి జనసమీకరణ కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

Updated : 24 Apr 2024 07:52 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: వై నాట్‌ కుప్పం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైకాపా నాయకులు.. ఆ పార్టీ అభ్యర్థి భరత్‌ నామపత్రాల దాఖలు ర్యాలీకి జనసమీకరణ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే భరత్‌ తరఫున ఆయన సతీమణి దుర్గ ఒక సెట్‌ నామినేషన్‌ వేయగా.. బుధవారం భరత్‌ భారీ ర్యాలీగా వెళ్లి మరో సెట్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఇందుకోసం కుప్పం నియోజకవర్గంతో పాటు సమీపంలోని తమిళనాడు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు.. వెయ్యి నగదు, మద్యం, బిర్యానీ ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వైకాపా నేతల కుట్రలను తెదేపా శ్రేణులు బట్టబయలు చేశారు. కుప్పంలో బుధవారం జరిగే వైకాపా సమావేశానికి 50 మందిని తీసుకురమ్మన్నారని తమిళనాడులోని పర్చూరుకు చెందిన పళణి వివరించారు. వాళ్లకు ఇవ్వడానికి రూ.50 వేల నగదు కూడా అందజేశారన్నారు. కుప్పానికి 25 మందిని తీసుకొస్తే నగదు, మద్యం, బిర్యానీ ఇస్తామన్నారని తమిళనాడులోని నాట్రాంపల్లెకు చెందిన రవికుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు అక్కడి వారు మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img