icon icon icon
icon icon icon

Sunkara Padmasree: విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా: సుంకర పద్మశ్రీ

తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు.

Updated : 23 Apr 2024 12:58 IST

విజయవాడ: తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పద్మశ్రీ స్పందిస్తూ తాను లోక్‌సభ బరిలో ఉంటానని.. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపినట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img