icon icon icon
icon icon icon

BJP: అనపర్తి భాజపా అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి?

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై కూటమిలో గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Published : 21 Apr 2024 15:44 IST

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై కూటమిలో గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రామకృష్ణారెడ్డి భాజపా అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. తెలుగుదేశం వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా.. పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా అనపర్తి సీటు భాజపాకు కేటాయించారు. తనకు టికెట్‌ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి  లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును భాజపా తీసుకునే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ, సమీకరణలు కుదరక పోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img