icon icon icon
icon icon icon

BJP: భాజపాలో చేరిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపాలో చేరారు. 

Updated : 23 Apr 2024 22:30 IST

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపాలో చేరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, సిద్దార్థనాథ్‌సింగ్‌, అరుణ్‌సింగ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. అనపర్తి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు.

తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా అనపర్తి సీటు భాజపాకు కేటాయించారు. తనకు టికెట్‌ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును భాజపా తీసుకునే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ, సమీకరణలు కుదరక పోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపా నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img