icon icon icon
icon icon icon

Pawan Kalyan: మత్స్యకారుల జీవనోపాధిపై జగన్‌ దెబ్బకొట్టారు: పవన్‌ కల్యాణ్‌

ఎన్నికల్లో తన పోటీ జగన్‌తోనే అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Published : 23 Apr 2024 22:37 IST

పిఠాపురం: ఎన్నికల్లో తన పోటీ జగన్‌తోనే అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ ప్రసంగించారు. ఉప్పాడలో  హార్బర్‌ నిర్మించకుండా 20వేల మంది మత్స్యకారుల జీవనోపాధిపై జగన్‌ దెబ్బ కొట్టారని మండిపడ్డారు. సాక్షిలో ప్రకటనల కోసం రూ.320 కోట్లు ఇచ్చారని, అదే డబ్బు పేదలకోసం ఎందుకు ఖర్చు చేయటం లేదని ప్రశ్నించారు. ‘‘ఎస్‌ఈజడ్‌లో ఇంకా ఎందుకు పరిశ్రమలు పెట్టలేదని అడిగితే.. ఇంకా కోడి పొదగలేదు.. గుడ్డు పెట్టలేదని మంత్రి చెబుతున్నారు. వైకాపా కోడికాదు.. కట్లపాము. దాని గుడ్లను అదే తినేస్తుంది.   ఉప్పాడ తీరంలో 320 ఎకరాలు కోతకు గురైంది. సముద్రపు కోతను అరికడతాం. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ వేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img