icon icon icon
icon icon icon

Pawan Kalyan: పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు.

Updated : 23 Apr 2024 11:10 IST

పిఠాపురం: జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది. 

అనంతరం పవన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. నామినేషన్‌ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్‌ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img