icon icon icon
icon icon icon

Yeluri Sambasiva Rao: తెదేపా నేతపై ఎస్‌ఐ అనుచిత వ్యాఖ్యలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్‌ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు.

Published : 23 Apr 2024 16:37 IST

పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్‌ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్‌, పర్చూరు మండల తెదేపా అధ్యక్షుడు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనపై ఎస్సై అసభ్య పదజాలంతో దూషించారు. ఎస్సై తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఎస్సై బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శివనాగిరెడ్డి వైకాపా ఏజెంట్‌గా పని చేస్తున్నారని ఎస్పీకి ఏలూరి సాంబశివరావు ఫిర్యాదు చేశారు. వైకాపాకి అనుకూలంగా పని చేస్తున్నారన్న ఆరోపణలపై శివనాగిరెడ్డిని ఒకసారి ఎన్నికల కమిషన్‌  వీఆర్‌కు పంపింది. అక్కడి నుంచి ఆర్వో కార్యాలయానికి బందోబస్తుకు వచ్చారు. అయినా, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img