icon icon icon
icon icon icon

Bapatla: వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌పై వాలంటీర్‌ ఆనంద్‌బాబు పోటీ

వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు.

Updated : 24 Apr 2024 17:19 IST

బాపట్ల: వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్‌బాబు అనే వాలంటీర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బాపట్ల పార్లమెంట్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఐదేళ్లలో ఎంపీ సురేశ్‌ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అరాచకాల్ని భరించలేకే పోటీకి దిగినట్లు ఆనంద్‌బాబు తెలిపారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడిపే సురేశ్‌.. బాపట్ల ఎంపీ అయిన తర్వాత రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధికోసం ఉద్దండరాయునిపాలెంలోని ఎంపీ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img