icon icon icon
icon icon icon

YS Sharmila: వైఎస్‌ఆర్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులా?: షర్మిల

మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్‌ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు.

Updated : 24 Apr 2024 15:20 IST

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్‌ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై బొత్స ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు. 

‘‘అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ను బొత్స సత్యనారాయణ తిట్టారు.. తాగుబోతు అన్నారు. జగన్‌కు ఉరిశిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. విజయమ్మను సైతం అవమాన పరిచారు. అలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు. జగన్‌ కేబినెట్‌లో ఉన్నవాళ్లంతా వైఎస్‌ఆర్‌ను తిట్టినవాళ్లే. వాళ్లంతా అతడికి తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు. నిజంగా ఆయన కోసం పనిచేసిన వాళ్లు మాత్రం ఏమీ కారు. ఆయన కోసమే పనిచేసి గొడ్డలి పోటుకు గురై వాళ్లూ ఏమీ కారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో వైఎస్‌ఆర్‌ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్‌ అంటే సాయిరెడ్డి.. ఆర్‌ అంటే రామకృష్ణారెడ్డి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img