ఈ ఉంగరం ధరిస్తే అన్నీ శుభాలే..

ఉంగరాలను అనేకమంది ధరిస్తుంటారు. కొందరు తమ రాశులను బట్టి ధరిస్తే మరి కొందరు ఉంగరం హస్తభూషణం అన్న రీతిలో వేసుకుంటారు. నవరత్నాల ఉంగరంతో పాటు పలు రకాలు ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి.

Published : 14 Jan 2020 10:36 IST

ఉంగరాలను అనేకమంది ధరిస్తుంటారు. కొందరు తమ రాశులను బట్టి ధరిస్తే మరి కొందరు ఉంగరం హస్తభూషణం అన్న రీతిలో వేసుకుంటారు. నవరత్నాల ఉంగరంతో పాటు పలు రకాలు ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి. కేరళలోని పయ్యనూర్‌ పవిత్రమొతిరం అనే ఉంగరాన్ని ధరిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని కేరళ వాసుల విశ్వాసం.

సుబ్రమణ్యస్వామి ఆశీస్సులతో..

కన్నూర్‌ జిల్లా పయ్యనూర్‌లో శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం ఉంది. తొలినాళ్లలో దర్భతో వీటిని తయారుచేసేవారు. ఆలయ నిర్మాణ సమయంలో స్వామి ఆశీస్సులతో బంగారంతో తయారుచేయాలని స్థానిక బంగారు పనివారిని పురోహితుడు కోరాడు. దీంతో పవిత్రమైన దర్భ ఆకారంతోనే వీటిని తయారుచేయడంతో పవిత్రత చేకూరింది.

తయారీకి శ్రమించాల్సివుంది..

పయ్యనూర్‌లోని కొన్ని కుటుంబాల వారు మాత్రమే సంప్రదాయంగా వీటిని తయారుచేస్తుంటారు. ఒక్కో ఉంగరం తయారీకి మూడు రోజుల నుంచి వారం రోజులవరకు పడుతుంది. సంప్రదాయరీతిలో వీటిని తయారుచేయాలి. ఇందులో ఉండే మూడు గీతలు మానవ శరీరంలోని ఇద, పింగళ, సుషున్మ అనే నాడులకు ప్రతీకగా నిలుస్తాయి. వీటి తయారీలో ఉండేవారు జీవితాంతం మాంసం, మద్యం ముట్టకూడదు.  

కుండలినీ శక్తి..
ఈ ఉంగరాన్ని ధరిస్తే మనిషి శరీరంలోని కుండలినీ శక్తికి  శక్తిమంతంగా మారుతుందని పండితులు చెబుతారు. త్రిమూర్తులైన బ్రహ్మ, శివ, విష్ణువుల అనుగ్రహం కలుగుతుందని స్వర్ణకారులు తెలిపారు. 

గుడిలో పూజచేసి ధరించాలి..
ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసిన అనంతరం పయ్యనూర్‌లోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరమే ధరించాలని స్థానికులు తెలిపారు. అప్పుడు ఆ పవిత్రత లభిస్తుందని వారు వెల్లడించారు. కుడిచేతికి ఉంగరం వేలికి మాత్రమే ధరించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి ఉంగరం 38 గ్రాముల బరువు ఉంటుంది. 28, 19, 14, 9,7, 4 గ్రాముల్లో కూడా ఈ ఉంగరాలు లభిస్తాయి. 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని