Chandrababu arrest: చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగుల ఆగ్రహం
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు.
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. విప్రో సర్కిల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయామ్ విత్ సీబీఎన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో విప్రోకూడలిలో ఉద్రిక్తత నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో తడాఖా చూపిస్తాం..
‘‘చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. కక్ష సాధించేందుకే బాబును జైల్లో పెట్టారు. ఆయన వల్లే మాకు ఉపాధి అవకాశాలు లభించాయి. మా జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటాం. సైకో పోవాలి.. సైకిల్ రావాలి. కక్ష సాధింపు రాజకీయాలు అభివృద్ధికి విఘాతం. వచ్చే ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం’’ అని ఐటీ ఉద్యోగులు హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Madhya Pradesh Elections: ‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్!
-
Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
‘పీఓకే పర్యటన’ వివాదం.. స్పందించిన అమెరికా దౌత్యవేత్త గార్సెట్టి
-
Chandrababu Arrest: ఆంధ్రాలో పంచాయితీ.. అక్కడే తేల్చుకోవాలి: కేటీఆర్
-
TB Medicine: టీబీ మందుల కొరతపై వార్తలు.. కేంద్రం స్పందన ఇదే..!
-
Sundar Pichai : వావ్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!