Roja: పాదయాత్రలు చేస్తే బరువు తగ్గడం తప్ప ప్రయోజనం లేదు: రోజా

పవన్‌ కల్యాణ్‌ వారాహితో వచ్చినా, లోకేశ్‌ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. భవానీ ద్వీపంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొన్నారు.

Published : 17 Jan 2023 01:42 IST

విజయవాడ: పర్యాటక రంగంలో ఏపీని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. భవానీ ద్వీపంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మన గ్రామం’ స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు. ఆనంతరం మట్టి కుండలు తయారు చేశారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భవానీ ద్వీపానికి వస్తే  సొంత గ్రామానికి వచ్చినట్లుందన్నారు. 2023 నూతన సంవత్సర వేడుకలను కూడా మొదటిసారి భవానీ ద్వీపంలో చేశామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చినట్లు మంత్రి రోజా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌ వారాహితో వచ్చినా, నారా లోకేష్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, పాదయాత్రలు చేస్తే బరువు తగ్గడం తప్ప ప్రయోజనం ఉండదని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని