Prakasam: గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండో గేటు

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది.

Published : 08 Dec 2023 22:18 IST

గుండ్లకమ్మ: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టు నుంచి నీరు వృథాగా పోతోంది. గత ఏడాది ఆగస్టులో ఇదే ప్రాజెక్టులో మూడో నంబర్‌ గేటు కొట్టుకుపోయింది. మూడో గేటుకు ఇప్పటికీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయకపోగా.. తాజాగా రెండో గేటు కూడా కొట్టుకుపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఘటనపై జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ.. ‘‘రెండో గేటు కింద ఉన్న 2 ఎలిమెంట్స్‌ కొట్టుకుపోయాయి. ఇంజినీరింగ్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన స్టాప్‌లాక్స్‌ పెడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 2 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో మరో 1.5 టీఎంసీల నీరు ఉంటుంది. సాగునీటి గురించి రైతులు ఆందోళన చెందొద్దు. ప్రాజెక్టు దిగువభాగంలో ఉన్న గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలి’’  కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని