Hyderabad: హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా కారణం

కోటిపైగా జనాభా, మెట్రో నగరం, ఐటీకి ముఖ్య కేంద్రం, ఎందరో వలస జీవులకు ఉపాధి చూపే భాగ్యనగరం. హైదరాబాద్ పేరు చెబితే వినిపించే పేర్లు ఇవి. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నగరంలో ప్రమాదకర కాలుష్య పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయని తాజా అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలు పెరగడానికి ఇవి కూడా కారణం అని ఇందులో వెల్లడైంది.

Published : 06 May 2024 12:09 IST

కోటిపైగా జనాభా, మెట్రో నగరం, ఐటీకి ముఖ్య కేంద్రం, ఎందరో వలస జీవులకు ఉపాధి చూపే భాగ్యనగరం. హైదరాబాద్ పేరు చెబితే వినిపించే పేర్లు ఇవి. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నగరంలో ప్రమాదకర కాలుష్య పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయని తాజా అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలు పెరగడానికి ఇవి కూడా కారణం అని ఇందులో వెల్లడైంది. హైదరాబాద్‌లోని 80శాతం ప్రాంతం అత్యంత కాలుష్య కారకంగా మారిందని స్పష్టమైంది. వీటి వల్ల శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగున్నట్లు తేలింది. వాహనాలు, పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, పట్టణ ప్రణాళికలో లోపాలే ఈ దుస్థితికి కారణం అని తాజా అధ్యయనం తేల్చింది. 

Tags :

మరిన్ని