Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 07 Apr 2024 13:01 IST

1. హైదరాబాద్‌ మెట్రోలో రూ.59 హాలిడే కార్డు రద్దు

ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే రూ.59 హాలిడే కార్డును హైదరాబాద్‌ మెట్రో రద్దు చేసింది. మార్చి 31తో ఈ ఆఫర్‌ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ కార్డుతో రూ.59 చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే వీలుండేది. పూర్తి కథనం

2. చైనాకు చేదు కబురు.. ఆకస్‌ కూటమిలోకి జపాన్‌..?

దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు జపాన్‌ కీలక అడుగు వేయనుందని నివేదికలు వస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా నౌకాదళానికి కీలకమైన అణుశక్తి సబ్‌మెరైన్ల తయారీ ఒప్పందమైన ఆకస్‌(Aukus)ను విస్తరించి దానిలోకి జపాన్‌ను కూడా తీసుకొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఫైనాన్షిల్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. త్వరలోనే దీనిపై చర్చలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.పూర్తి కథనం

3. మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు

హైదరాబాద్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. ‘‘మాధవీలతా జీ. మీ ‘ఆప్‌ కీ అదాలత్‌’ ఎపిసోడ్‌ అద్భుతంగా ఉంది.పూర్తి కథనం

4. హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి లాక్కెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్‌ వద్ద బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది. పూర్తి కథనం

5. మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు.. పోరాడే సైనికులు: సీఎం రేవంత్‌రెడ్డి

తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ ఓ మహా సముద్రం.. అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బంధువులు. మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు.పూర్తి కథనం

6. ‘భారత్‌ అద్భుతం’.. ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడి ప్రశంసలు

పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్‌ పనితీరు అద్భుతమని ఐరాస జనరల్‌ అసెంబ్లీ (UNGA) అధ్యక్షుడు డేనిస్‌ ఫ్రాన్సిస్‌ కొనియాడారు. అందుకోసం డిజిటలైజేషన్‌ను (Digitalisation) సమర్థంగా వినియోగించుకుంటోందని తెలిపారు. ఫోన్‌ లాంటి ఒక డివైజ్‌, డిజిటలైజేషన్‌ మోడల్‌తోనే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు.పూర్తి కథనం

7. అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్‌ది మొదటి స్థానం: లోకేశ్‌

సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాలనుకొండలోని ఆర్ఆర్ అపార్టుమెంట్‌ వాసులతో సమావేశమై మాట్లాడారు. పూర్తి కథనం

8. విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై ట్రోలింగ్‌.. సెహ్వాగ్‌ అదిరే కౌంటర్

ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 బంతుల్లో 113 పరుగులు (స్ట్రైక్‌రేట్‌ 156.94) చేశాడు. 67 బంతుల్లో శతకం మార్క్‌ను తాకాడు. ఐపీఎల్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో ఇదొకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే కూడా 67 బంతుల్లోనే శతకం చేశాడు.పూర్తి కథనం

9. కానిస్టేబుల్‌ మృతి.. మిస్‌ఫైరా.. ఆత్మహత్యా..?

పాతబస్తీ హుస్సేనీఆలం పరిధి కబూతర్‌ఖానా వద్ద  ఓ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు రౌండ్లు ఫైర్‌ జరిగినట్లు వెల్లడించారు. మృతుడిని 1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్‌గా గుర్తించారు.పూర్తి కథనం

10. భారాసకు షాక్‌..! కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే

భారాసకు మరో షాక్‌..! భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతోపాటు ఆయన సహచరులు కాంగ్రెస్‌లో చేరారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని