Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Mar 2024 13:04 IST

1. రాజకీయ ప్రకటనల హోర్డింగులు వెంటనే తొలగించాలి: ముకేశ్‌కుమార్‌ మీనా

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయ పరిసరాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో దీన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. పూర్తి కథనం

2. భారాసకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా

భారాసకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా భారాసకు రాజీనామా చేసినట్లు చెప్పారు. ‘‘చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చిన కేసీఆర్‌, కేటీఆర్‌కు ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నా.పూర్తి కథనం

3. కోటప్పకొండకు వెళ్తుండగా బస్సు బోల్తా.. 40 మందికి తీవ్ర గాయాలు

పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు పల్నాడు జిల్లా కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటన ఆదివారం అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది కోటప్పకొండకు ఓ స్కూలు బస్సులో వెళ్తున్నారు.పూర్తి కథనం

4. భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. భారాస వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్‌.. శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. భారాసను వీడనున్నారనే ప్రచారం తర్వాత ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముఖ్యనేతలు ఆయన్ను బుజ్జగించారు.పూర్తి కథనం

5. ప్రణీత్‌రావును కస్టడీకి తీసుకున్న పోలీసులు

ఆధారాల ధ్వంసం కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందు కోసం సిబ్బంది చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని ఏడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలిచ్చింది.పూర్తి కథనం

6. 18 మంది పాక్‌ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

అహ్మదాబాద్‌లో నివాసముంటున్న పాకిస్థాన్‌కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు. పూర్తి కథనం

7. అమెరికా వారికి పౌరసత్వం ఇస్తుందా..?: హరీశ్‌ సాల్వే

భారత్‌ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (CAA) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్‌ న్యాయవాది, మాజీ సోలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తప్పుపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న మైనార్టీల కోసం అమెరికా సరిహద్దులు తెరుస్తుందని వ్యంగ్యంగా అన్నారు. పూర్తి కథనం

8. కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. దిల్లీ జల మండలిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇలా కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా తొమ్మిదోసారి.పూర్తి కథనం

9. నేను గెలవకపోతే అమెరికాలో ‘రక్తపాతమే’: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్‌తో పోటీకి సిద్ధమైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికలు యూఎస్‌ చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో ‘రక్తపాతం’ మొదలవుతుందని పేర్కొన్నారు. బైడెన్‌ (Biden) విధానాలను విమర్శిస్తూ ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి కథనం

10. పీపుల్స్‌ ప్లాజాలో శారీ రన్‌.. పాల్గొన్న నారా బ్రాహ్మణి

తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్‌’ నిర్వహించాయి. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని