Updated : 25 Jun 2021 13:13 IST

Top Ten News @ 1 PM

1. AP News: ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ సీఎస్‌ను హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దంటూ గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారంటూ తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. INDvsENG: ఓటమితో మారిన బీసీసీఐ వైఖరి!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత బీసీసీఐలో మార్పు కనిపిస్తోంది! ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డును ఒప్పించే పనిలో నిమగ్నమైందని సమాచారం. సాధారణంగా ఎక్కడ పర్యటించినా.. అక్కడి ఫస్ట్‌క్లాస్‌ జట్లతో సన్నాహక మ్యాచులు ఆడటం సంప్రదాయం. అన్ని జట్లు ఇలాగే చేస్తాయి. కానీ కరోనా మహమ్మారి వల్ల వీలవ్వడం లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

WTC Final: గాయపడ్డ ఇషాంత్‌.. వేలికి కుట్లు

3. భారత సరిహద్దులకు చైనా బుల్లెట్‌ రైలు

చైనా విస్తరణ కాంక్ష మరోసారి బయటపడింది. భారత సరిహద్దుల్లోకి బలగాలను వేగంగా తరలించేందుకు తగిన వనరులను సిద్ధం చేసుకుంటున్న డ్రాగన్‌.. ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అరుణాచల్‌ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్‌ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్‌ రైలును ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MAA Election: మాది ఆవేదనతో పుట్టిన ప్యానల్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. సెప్టెంబర్‌ నెలలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్న ఆయన గురువారం సాయంత్రం తన ప్యానల్‌ని ప్రకటించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* MAA Election: చిరు ఆశీస్సులు కూడా మాకే..!

5. కెనడా పాఠశాలల్లో అస్థిపంజరాల గుట్టలు

వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెల బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు.  ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒక్క డోసుతో.. వృద్ధుల్లో 60% తగ్గుతున్న ముప్పు! 

వృద్ధుల్లో కొవిడ్‌ ముప్పును నివారించడంలో ఫైజర్, కొవిషీల్డ్‌ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనమొకటి తేల్చింది! 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారు ఈ టీకాలను ఒక్క డోసు తీసుకున్నా.. వారు కరోనా బారిన పడే ముప్పు దాదాపు 60% మేర తగ్గుతున్నట్లు నిర్ధారించింది. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ (యూసీఎల్‌) పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

42సార్లు పాజిటివ్‌.. 5సార్లు అంత్యక్రియలకు సిద్ధం

7. Casting Couch: సౌత్‌ డైరెక్టర్‌పై బీటౌన్‌ భామ విమర్శలు

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ అగ్ర దర్శకుడి వల్ల తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానని బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా ఆరోపించారు. ఓ సినిమా ఆఫర్‌ విషయమై  ఆ దర్శకుడు తనతో ఇబ్బందికరంగా మాట్లాడాడని ఆమె అన్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటి నీనా గుప్తా.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చాలాకాలం తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సుర్వీన్‌ చావ్లాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉచిత పథకాలతో నిధుల కొరత: రఘురామ

ఉచిత పథకాలతో ఏపీ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడుతోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు ఆరో లేఖను ఆయన రాశారు. చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పన్నుల అంశాన్ని రఘురామ అందులో స్తావించారు. చెత్తపై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: తెలుగు ప్రజలకు సేవ చేస్తా: నవనీత్‌కౌర్‌

9. ఉద్యోగం నుంచి విరామం తీసుకోవాలనుకుంటున్నారా?

ఉద్యోగంలో తీరిక లేకుండా గడుపుతాం. ఈ క్రమంలో ఇంటిపై కాస్త శ్రద్ధ తగ్గుతుంది. అలా కొన్ని పనులు వాయిదా పడిపోయి కాలం గడుస్తున్న కొద్దీ పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. మరికొన్ని సార్లు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే వారిని చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఇవీ కాకపోతే.. కుటుంబ సంతోషం కోసం సుదీర్ఘ విహారయాత్రకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో ఉద్యోగానికి కాస్త ఎక్కువ సమయమే విరామం ఇవ్వాల్సి రావొచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. oxygen : దిల్లీ 4 రెట్లు అదనంగా అడిగింది..! 

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ కీలక విషయాలను వెల్లడించింది. దిల్లీ ప్రభుత్వం తన అవసరాలకు మించి నాలుగు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్‌ను కోరినట్లు తేల్చింది. ఏప్రిల్‌-మే నెలల్లో ఆక్సిజన్‌ సరఫరాలో విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలా ఆస్పత్రుల్లో  ప్రాణవాయువు అందక రోగులు కన్నుమూసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. దీంతో దిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: 6లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని