Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 13 Feb 2023 17:12 IST

1. ప్రగతి భవన్‌లోనా..? ఫామ్‌హౌస్‌లోనా..? కేసీఆర్‌తో చర్చకు నేను రెడీ : కిషన్‌రెడ్డి

దేశాన్ని అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శించేందుకే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని.. బడ్జెట్‌పై కేసీఆర్‌ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. దిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రాష్ట్రం ఏర్పాటు తర్వాత భారీగా పెరిగిన తెలంగాణ అప్పులు: కేంద్రం 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022 అక్టోబర్‌ నాటికి రూ.4.33 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పులుగా వీటిని పేర్కొంది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. జగన్‌ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదు?: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

పారిశ్రామికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షిస్తోందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతంగా ఉందని.. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందన్నారు. తలసరి ఆదాయం కూడా 38.5 శాతం మేరకు పెరిగిందని చెప్పారు. కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తున్నారని.. అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆ విషయాన్ని కోహ్లీ కెప్టెన్సీ నుంచి నేర్చుకున్నా: రోహిత్‌ శర్మ

విరాట్ కోహ్లీ (Virat Kohli) నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ .. సారథిగా అన్ని ఫార్మాట్లలో విజయవంతమవుతున్నాడు. ఇప్పటికే అతడి నాయకత్వంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్న టీమ్‌ఇండియా.. టెస్టుల్లోనూ విజయాలు సాధిస్తోంది. తాజాగా రోహిత్‌ (Rohit Sharma) కెప్టెన్సీలో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఇండిగోకు లాభాలు.. పైలట్లకు వేతన పెంపులు షురూ!

దేశంలో విమాన ప్రయాణాలు కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. విమానయాన సంస్థల (airlines) ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు క్రమంగా కంపెనీలు పునరుద్ధరిస్తున్నాయి. తాజాగా ఇండిగో (IndiGo) తమ పైలట్ల వేతనాల్లో వార్షిక పెంపు (Increments) ప్రక్రియను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. LTTE ప్రభాకరన్‌ బతికే ఉన్నారు.. త్వరలోనే బయటకొస్తారు: నెడుమారన్‌

ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌( LTTE chief Prabhakaran) జీవించి ఉన్నట్లు తమిళ జాతీయోద్యమ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం ఆయన త్వరలో బయటకు వస్తారన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది పాళ నెడుమారన్‌(Pazha Nedumaran). ఆయన గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. తంజావుర్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభాకరన్‌ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలో బయటకు వస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కొన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంలో జాప్యం.. అసలు కారణమిదే..: నిర్మలా సీతారామన్‌

జీఎస్టీ పరిహారం(GST compensation) చెల్లింపుల్లో కేంద్రం జాప్యం చేస్తోందంటూ పలు రాష్ట్రాలు విమర్శిస్తున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) సమాధానమిచ్చారు. ఇదే అంశంపై లోక్‌సభ(Lok Sabha)లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం ఆమె సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాలు ఏజీ (అకౌంటెంట్‌ జనరల్‌) సర్టిఫికేట్‌ను సమర్పించకపోవడం వల్లే జీఎస్టీ పరిహారం చెల్లింపు ఆలస్యమవుతోందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వేల సంఖ్యలో మృతదేహాలు.. సమాధులు తవ్వేందుకు పొక్లెయిన్లు..!

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం సృష్టించిన విలయం.. ఎన్నో దయనీయ దృశ్యాలను కళ్లముందుంచుతోంది. ఇప్పటికే వారం గడవడం, గడ్డకట్టే చలి కావడంతో కుటుంబసభ్యులు తమ వారి ప్రాణాలపై నమ్మకం కోల్పోతున్నారు. అయినా ఎక్కడో చిన్న ఆశతో ఎదురుచూసిన వారికి కన్నీరే మిగులుతోంది. దాంతో మృతుల సంఖ్య వేలకు వేలు పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఒకే దగ్గర భారీ సంఖ్యలో మృతదేహాలను ఖననం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అమెరికా పౌరులారా.. వెంటనే రష్యాను వీడండి!

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం(Ukraine Crisis) ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా(America) కీలక ప్రకటన చేసింది. రష్యా(Russia)లోని అమెరికన్లందరూ(America Citizens) వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్‌(Ukraine)లో ఇరుపక్షాల మధ్య తీవ్రతరమవుతోన్న దాడులతోపాటు రష్యన్ భద్రతాసంస్థల నుంచి ఏకపక్ష అరెస్టులు, వేధింపుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఓటర్లలో సగం అతివలే.. అయినా 60ఏళ్లలో ఒక్క మహిళా గెలవలేదు..

మహిళా రాష్ట్రపతి, మహిళా ప్రధానమంత్రి, అనేక రాష్ట్రాలకు మహిళా ముఖ్యమంత్రులను ఎన్నుకున్న దేశం మనది. కౌన్సిలర్ల నుంచి కేబినెట్‌ పదవుల వరకు ఇప్పుడు అన్నింటా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ (Nagaland) మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. 60 ఏళ్ల ఆ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని