Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. Republic day: రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోంది: గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నాలుగేళ్లలో.. ఒక్కపునాది లేదు..!
సౌకర్యవంతంగా ఉన్న అన్నదాన భవనాన్ని.. కనీస ప్రణాళిక లేకుండా ఆరేళ్ల కిందట అప్పటి ఈవో కూలగొట్టేశారు. మళ్లీ అధునాతనంగా అన్నదాన భవనం కడతామని చెప్పారు. పునాదులు కూడా ఇప్పటివరకూ కట్టింది లేదు. అన్నదాన స్థలాలను మారుస్తూ భక్తులను అవస్థలకు గురిచేశారు కొండపై ప్రసాదం పోటు భవనమూ నేలమట్టం చేశారు. ఆ తర్వాత కొండ దిగువన ఇళ్ల మధ్యలో ఉన్న వసంత మల్లికార్జున ఆలయం ప్రాంగణంలో రూ.కోటి ఖర్చుపెట్టి ఓ షెడ్డును తాత్కాలికంగా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఎర్రకోటలో ఓరుగల్లు!
ఓరుగల్లు పతాకం మరోసారి దేశ రాజధాని దిల్లీలో రెపరెపలాడనుంది. ఎర్రకోట కర్తవ్యపథ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో ఉమ్మడి వరంగల్ నుంచి పలువురు తమ ప్రదర్శనల్లో అలరించనున్నారు. సాంస్కృతిక, సైనిక విభాగాల్లో జరిగే వేడుకలు, కవాతులో వీరికి అవకాశం దక్కింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెప్పడానికి వీరే నిదర్శనం. అకుంఠిత దీక్షతో సాధన చేసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర దేశ ప్రముఖుల ముందు ప్రదర్శనలు ఇచ్చే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. అదే సమయంలో ఓరుగల్లు కీర్తిని చాటుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. వచ్చేదెలా.. ఉండేదెలా!!
నగర పరిధిలోని టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయా నివాస సముదాయాల్లో సదుపాయాలు కల్పించకపోవడంతో సగం మంది కూడా
నివాసం ఉండడం లేదు. ఫలితంగా పేదలకు సొంతింటి కల సుదూరంగానే ఉండిపోతోంది. మరో వైపు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా రూ.35వేలు చెల్లించాల్సి రావడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. వంద కోట్లపైనే కొండంత ఆశలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబరు 7న జరిగిన జగిత్యాల బహిరంగ సభలో ప్రకటించారు. వచ్చేనెల 3 నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి మాస్టర్‌ప్లాను రూపొందించి యాదాద్రి తరహాలో ఆలయాన్ని తీర్చితిద్దితే దాదాపు కొండగట్టు క్షేత్రం రూపురేఖలు మారిపోతాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోరా..!
రాష్ట్రంలో పేరెన్నికగన్న సర్వజనాసుపత్రికి వస్తే మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఆశతో రోగులు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. సర్కారీ వైద్యంపై పేదలకు మరింత నమ్మకం కలిగేలా వైద్యులు కూడా అత్యంత ఆధునిక చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖరీదు చేసే ఈ సర్జరీ ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరు సర్వజనాసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా చేస్తున్నారు. దీంతో రోగులు వస్తున్నప్పటికీ ఈ శస్త్రచికిత్సలు మూడున్నరేళ్ల నుంచి నిలిపివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అల్లంతదూరంలో.. ఆశలు గల్లంతు
ఐటీ రంగంలో అనిశ్చితి కారణంగా..ఆయా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు ఏడు వేల మందికి పైగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. కోదాడ నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం చేసేవారు. డిసెంబరు మొదటి వారంలో సదరు సంస్థ ఆ ఉద్యోగిని తొలగించడంతో అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం మరో 60 రోజుల్లో ఉద్యోగం చూసుకోకపోతే స్వదేశానికి పయనమవ్వాల్సిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ముంపు ముప్పు లేదు
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముంపు ముప్పు ఉండబోదని, ఇప్పటికే అధ్యయనం పూర్తయిందని కేంద్ర జలసంఘం స్పష్టీకరించింది. మరోసారి ఈ విషయంపై అధ్యయనం చేసే అవకాశమే లేదని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ముంపు ముప్పు ఉంటుందంటూ కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఎన్‌సీసీతో ఆర్మీలో అవకాశం!
నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్‌సీసీ)లో చేరినవారిని ఆర్మీ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. అన్ని నియామకాల్లోనూ కొన్ని పోస్టులను వారి కోసమే కేటాయిస్తుంది. అలాగే ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్ ఏటా విడుదల చేస్తోంది. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు లెఫ్టినెంట్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు వీరికి దక్కుతాయి. ఇటీవల వెలువడిన ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ప్రకటనకు సంబంధించిన వివరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పెళ్లి కళ వచ్చిందండోయ్!
భజంత్రీలు మోగే సమయం ఆసన్నమైంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లి సందడికి తెరలేచింది. ఈ నెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలున్నాయి. వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునేందుకు ఎవరికివారు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యువతీయువకులు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kamal Haasan: ఆ రోజు వాళ్లెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు: కమల్ హాసన్
-
Sports News
Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్ పాండ్యపై గావస్కర్ ప్రశంసలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య