Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Feb 2023 21:11 IST

1. Telangana News: ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జీవో 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని  నిర్ణయించినట్టు తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!

తుర్కియే(Turkey), సిరియా(Syria)లోని ప్రాంతాలను భారీ భూకంపం(Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, దెబ్బతిన్న రహదారులు, ధ్వంసమైన నిర్మాణాలతో ఇరుదేశాల్లో విలయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తుర్కియే, సిరియాలు.. వెంటనే ‘అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్‌(The International Charter Space and Major Disasters)ను యాక్టివేట్ చేయమని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. అసలు ఏంటీ ఛార్టర్‌ తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. KTR: హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 11 నుంచి ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, ప్యారడైజ్‌, నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల కోసం హెచ్‌ఎండీఏ ఆర్డర్‌ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మిగిలిన 3 బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్‌ ప్రసాద్‌

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ వ్యవహారంలో టీమ్‌ఇండియాను ఉద్దేశిస్తూ పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్‌ కీలక వ్యాఖ్యలు చేసన విషయం తెలిసిందే. తాజాగా మియాందాద్‌ వ్యాఖ్యలకు భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఇంతకీ మియాందాద్‌ ఏమన్నాడు..? వెంకటేశ్‌ ప్రసాద్‌ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే..? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా

ముంబయి(Mumbai)లో 2008లో జరిగిన ఉగ్రదాడు(Mumbai terror attacks)ల్లో గాయాలను భారత్‌, అమెరికా ఇంకా మర్చిపోలేదని అమెరికా పేర్కొంది. విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ రోజువారీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజువారీ విలేకర్ల సమావేశంలో ఒకరు పాక్‌కు సాయంపై నెడ్‌ప్రైస్‌ను ప్రశ్నించారు. ‘‘2008 ఉగ్రదాడులు (Mumbai terror attacks)జరిగి 14ఏళ్లు అయింది.. దీనిలో ఆరుగురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. Boeing: బోయింగ్‌లోనూ కోతలు.. 2000 మంది సిబ్బందిపై వేటు!

మైక్రోసాఫ్ట్‌ (Microsoft), గూగుల్‌ (Google) లాంటి అంతర్జాతీయ టెక్‌ కంపెనీలు ఓ వైపు లేఆఫ్‌లు విధిస్తూ.. మరోవైపు సిబ్బందిని తగ్గించుకుంటున్న తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్  (Boeing)కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2000మందిని ఉద్యోగం నుంచి తొలగించి, వారి స్థానంలో ఔట్‌ సోర్సింగ్‌ (Outsourcing) ఉద్యోగులను (Employees) నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Civil Service: మోదీజీ.. సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులకు ఒక్క అవకాశమివ్వండి

సివిల్‌ సర్వీస్‌ (Civil Service) అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోదీ (PM Modi)ని తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కోరారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. IND vs AUS: నాగ్‌పుర్‌లో ‘టెస్టు’ రికార్డులు.. ఆధిక్యం ఎవరిదంటే..?

భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK).. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS).. జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు రసవత్తరంగా ఉంటాయని క్రికెట్ అభిమానుల భావన. అదే కోవలోకి  భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) టెస్టు సిరీస్‌ కూడా వచ్చి చేరింది. తాజాగా భారత్‌ వేదికగానే ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ జరగనుంది. బోర్డర్ - గావస్కర్ పేరిట జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు నాగ్‌పుర్‌లోని క్రికెట్ స్టేడియం (Nagpur Stadium) వేదికగా నిలవనుంది. మరి విదర్భ మైదానంలో ఆధిక్యం ఎవరిది..? గత గణాంకాలను ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సీజేఐ ధర్మాసనం ఎదుట రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐతో విచారణ విషయంలో తమ అభ్యంతరాలను డివిజన్‌ బెంచ్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Marriage: వివాహానికి ఆర్థిక ప్రణాళికలను ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?

పెళ్లిళ్ల సీజన్‌ (Marriage season) మళ్లీ మొదలయ్యింది. ఒకవేళ మీరూ వివాహానికి సిద్ధమవుతుంటే..  మీ కలల వివాహానికి ఆర్థిక ప్రణాళికలను సరైన రీతిలో ప్లాన్‌ చేసుకోవాలి. పెళ్లి అనేది నిస్సందేహంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలకమైన ఘట్టం. దీని కోసం ఖర్చు చేసేటప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. అందులోనూ భారతీయులు వివాహ వేడుకను నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటారు. కాబట్టి ఈ కీలక ఘట్టానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో ఇక్కడ చూడండి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని