Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Feb 2024 21:18 IST

 

1. Medigadda: మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు: విజిలెన్స్‌ నివేదికలో వెల్లడి

మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుకు సంబంధించి దర్యాప్తు జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం లోపాలను ఎత్తిచూపింది. ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్‌ డ్యామ్‌ తొలగించలేదని, కటాఫ్‌ వాల్స్‌, రాఫ్ట్‌ మధ్య అనుసంధానం డ్రాయింగ్స్‌ ప్రకారం లేదని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లోని 16 నుంచి 21వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Guntur: జగన్‌ దోపిడీ కోసమే.. ఏపీ ఇసుక విధానం: ఎంపీ బాలశౌరి

జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IN-SPAce: అంతరిక్ష రంగంలో భారత్‌ జోరు.. 14 నెలల్లో 30 ప్రయోగాలకు సిద్ధం!

రోదసి రంగంలో మరిన్ని విజయాల నమోదుకు భారత్‌ సిద్ధమవుతోంది. వచ్చే 14 నెలల్లో సుమారు 30 ప్రయోగాలు జరుగుతాయని అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్‌ (IN-SPAce)’ వెల్లడించింది. ఇందులో ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్‌’ (Gaganyaan)కు సంబంధించిన ఏడు పరీక్షలతోపాటు స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంకుర సంస్థలకు చెందినవి ఏడు మిషన్లు ఉన్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. TS News: తెలంగాణలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గనులశాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న ఇసుక విధానం అవినీతి దందాగా మారిందని.. తవ్వకాలు, రవాణాలో అడుగడుగునా అక్రమాలు జరగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.  RBI Policy: ఆర్‌బీఐ పాలసీలో ‘కీ ఫాక్ట్‌ స్టేట్‌మెంట్‌’ ప్రస్తావన.. ఇంతకీ ఏంటిది?

ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓ కీలక ప్రకటన చేశారు. వడ్డీ రేట్లతో పాటు అదనంగా విధించే ఇతర ఛార్జీల విషయంలో రుణ సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం ఆయా ఛార్జీల వివరాలను కీ ఫాక్ట్‌ స్టేట్‌మెంట్‌ (KFS)లో పొందుపరుస్తూ రుణ గ్రహీతలకు జారీ చేయాలని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Satya Nadella: 75 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ.. సత్య నాదెళ్ల ప్రకటన

ఈ ఏడాది చివరికి భారత్‌లో 75వేల మంది మహిళా డెవలపర్లకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అధినేత సత్య నాదెళ్ల (Satya Nadella) ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన గురువారం బెంగళూరులోని ‘మైక్రోసాఫ్ట్‌ ఏఐ టూర్‌’ నిర్వహించిన డెవలపర్ల సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ (AI) ఆవిష్కరణను మరింత వేగవంతం చేయడంలో భారత డెవలపర్ల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Nirmala Sitharaman: ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం .. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం

రాజకీయంగా, విధానాల పరంగా ఎన్డీయే (NDA) ప్రభుత్వం స్థిరంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ (economy)ను బలోపేతం చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. దేశ ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం లోక్‌సభలో శ్వేతపత్రాన్ని (white paper) ప్రవేశపెట్టారు.    గత యూపీఏ (UPA) పాలనతో పోలిస్తే.. తమ పదేళ్ల పాలనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో అందులో వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Enforcement Directorate: గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు.. ఈడీకి చిక్కిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి

ఆయనో ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service) అధికారి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. దేశ అటవీ సంపదను రక్షించాల్సిన వ్యక్తి. అలాంటిది, బాధ్యతను మర్చిపోయి అవినీతికి పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు అతడి నుంచి రూ. 4.5 కోట్ల నగదుతోపాటు, మరో రూ.34 కోట్ల విలువైన నగలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. India Bloc: ‘ఇండియా కూటమి’ గోడకు మరో బీట!

కేంద్రంలో ఎన్డీయేను (NDA) కూల్చడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏర్పాటుచేసిన ‘ఇండియా కూటమి’కి (India Bloc) తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) ప్రకటించగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ (Uttarpradesh) సమాజ్‌వాదీ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. YS Sharmila: కడప జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు భద్రత పెంపు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. తనకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా?’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించే సమయంలో ఆమెకు భద్రత పెంచుతామని జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని