Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 am

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 09 Apr 2024 09:03 IST

1. కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్‌?

‘వాన రాకడ.. రాష్ట్రంలో కరెంటు పోకడ’ ఎప్పుడనేది చెప్పడం కష్టమే. గత రెండేళ్లు విద్యుత్‌ కోతలతో ప్రజలకు చుక్కలు చూపిన జగన్‌ ప్రభుత్వం.. ఎన్నికల ఏడాదిలోనూ ఊరట కల్పించలేకపోతోంది. అనధికారిక విద్యుత్‌ కోతలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు కోతలకు సాంకేతిక సమస్యలంటూ ముసుగువేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చేతులూపడమేనా.. చేతల్లేవా జగన్‌!

ఏ ప్రభుత్వానికైనా విశ్వస నీయత ఎంతో ముఖ్యం.. పదవిలో ఉన్నవారు అది నిలబెట్టుకోవడం ఎంతో అవసరం.. అని వైకాపా అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ తరచూ మాటలు వల్లెవేసేవారు. కానీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న జగన్‌ ఆచరణలో ఆ మాటే మరిచారు. సీఎం హోదాలో పల్నాడు ప్రాంతానికి ఆరుసార్లు వచ్చారు. వచ్చినా ప్రతిసారీ ఎన్నో హామీలు గుప్పించారు. కొన్నిచోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపనలు సైతం చేశారు. కానీ సీఎంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఐప్యాక్‌ డైరెక్షన్‌లో.. జగన్‌ ప్రాయోజిత భజన

జగన్‌ భజన పరాకాష్ఠకు చేరింది. ఎంతగా అంటే.. తమకు కుమారులు, కోడళ్లూ అవసరం లేదని, జగన్‌ ఉంటే చాలని సదస్సులకు హాజరైన వారితో చెప్పించారు. కొందరిని ఎంపిక చేసి.. వారు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు ఐప్యాక్‌ ద్వారా శిక్షణ ఇప్పించారు. ఎక్కడైనా పదాలు మర్చిపోయినా, తడబడినా.. ఆ సంస్థ ప్రతినిధులు పక్కనే ఉండి మాటలు అందించారు. జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల్లో ముంచేశారు.. చంద్రబాబుపై దూషణలు, శాపనార్థాలతో విరుచుకు పడ్డారు. ‘పింఛనుదారులతో సీఎం ముఖాముఖి’ అంటూ ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జరిగిందిదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శివారు.. ఫాం ల్యాండ్స్‌ అక్రమాల జోరు

రాజధాని హైదరాబాద్‌ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉండటమనేది ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. వారాంతాల్లో విడిదిగా ఈ క్షేత్రాలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. కానీ కొందరు ఈ పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. సాగు భూములను చిన్న చిన్న విస్తీర్ణాలుగా మార్చి ఫాం ల్యాండ్స్‌ పేరిట విక్రయిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.ఎండ వేడి చల్లగా!

వేసవి అనగానే సెలవుల కాలమే గుర్తుకొస్తుంది. సరదాగా బయటకు వెళ్లటం, షికార్లు చేయటం బాగానే ఉంటుంది గానీ వేడిని తట్టుకోవటమే కష్టం. అప్పుడే ఎండలు ఎలా భగ్గుమంటున్నాయో చూస్తూనే ఉన్నాం. రోజురోజుకీ పెరిగిపోతున్న వేడి కలవర పెడుతోంది. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేసవి వెంట బెట్టుకొచ్చే సమస్యలూ సరేసరి. చెమట ఎక్కువగా పోయటం వల్ల ఒంట్లో నీరు, లవణాలు తగ్గిపోతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. లోపాలపై స్పందించరా?

విజిలెన్స్‌ నివేదికతో నీటిపారుదల శాఖ మేల్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణం పూర్తయి మూడేళ్లపాటు నిర్వహించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగినా, ప్రారంభించిన కొద్దికాలానికే బ్యారేజీల్లో సీపేజీ సమస్య ఏర్పడినా ఇన్నాళ్లూ చర్యలకు ఉపక్రమించని నీటిపారుదల శాఖలో.. విజిలెన్స్‌ నివేదికతో కదలిక వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.ప్రచారం కోసమే కేజ్రీవాల్‌పై పిటిషన్‌

మద్యం కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ కేవలం ప్రచారాన్ని ఆశించి వేసినట్లు ఉందని, దానికిగానూ కోర్టు ఖర్చు రూపంలో భారీగా వడ్డించాలని దిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొబ్బరి నేలను కొట్టేదెలా?

దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న భాజపా.. కర్ణాటక తర్వాత అత్యధికంగా దృష్టి  సారించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఆ రాష్ట్రంలో పాగా వేయాలని గత కొన్ని ఎన్నికలుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా ఆ రాష్ట్రం ఓటరు నాడి పార్టీకి అంతు చిక్కడం లేదు. విజయం దక్కడం లేదు. ఈసారీ భాజపా అంతే గట్టిగా పోరాటానికి సిద్ధమైంది. కీలక నేతలను పార్టీలో చేర్చుకుని రంగంలోకి దిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అన్నను మించిన అను‘చోరులు’!

పేదలు అనుభవిస్తున్న ఎసైన్డ్‌ భూములకు హక్కులన్నారు జగన్‌.. వెంటనే ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. రూ.కోట్ల విలువైన స్థలాలపై గద్దల్లా వాలిపోయారు. మేం చెప్పిన ధరకే ఇచ్చేయండి.. ధర ఎంతో చెప్పేయండి.. లేదంటే ప్రభుత్వం లాక్కుంటుందని భయభ్రాంతులకు గురిచేశారు. వాటిపై హక్కులు దక్కేలోపే పేదల నుంచి అప్పనంగా లాగేసుకున్నారు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రష్యా ప్రమాదకరమైన ఆట ఆడుతోంది.. అమెరికా

జపోరిజియా అణువిద్యుత్కేంద్రం (Zaporizhzhia nuclear plant) నుంచి రష్యా (Russia) సేనలు వెంటనే వైదొలగాలని అమెరికా (USA) పిలుపునిచ్చింది. దాని నిర్వహణను ఉక్రెయిన్‌కు అప్పగించాలని సూచించింది. ఈ కేంద్రంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం స్పందించింది. అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని