Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Mar 2024 17:06 IST

1. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి

భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన

రానున్న ఎన్నికలకు మరో అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌ను బరిలోకి దింపనున్నట్లు వెల్లడించింది. గతంలో రాజమహేంద్రవరం రూరల్‌ స్థానాన్ని దుర్గేశ్‌ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తెదేపాకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సుప్రీం తీర్పు ఎఫెక్ట్‌.. ఎస్‌బీఐ షేర్‌ విలువ పతనం!

ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేది లేదని భారతీయ స్టేట్‌ బ్యాంకుకు సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేయడం సదరు బ్యాంకు షేర్ల విక్రయాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఎస్‌బీఐ షేర్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమరావతిని అద్భుతంగా చంద్రబాబు తీర్చిదిద్దగలరు: ఎంపీ రఘురామ

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తుళ్లూరులో దీక్షా శిబిరానికి వెళ్లిన ఆయనకు.. రాజధాని రైతులు, మహిళలు స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. తనను ఆంధ్రాలో అడుగుపెట్టకుండా వైకాపా అరాచకం సృష్టించిందని చెప్పారు. జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ పోరాటం ఆపలేదని ఆయన వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి బెయిల్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బోర్డు మాజీ సభ్యులతో వచ్చే ఇతరులను శ్రీవారి దర్శనానికి అనుమతించం: తితిదే

 తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు. బోర్డు మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు కుటుంబసభ్యుల(తల్లిదండ్రులు, భార్య, పిల్లలు)తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే, కొందరు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇతరులను వెంటబెట్టుకొని వస్తున్నారని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సత్యం’ దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు సూర్య కిరణ్‌ (surya kiran) కన్నుమూశారు. గత కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. తెలుగులో సుమంత్‌ హీరోగా నటించిన ‘సత్యం’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీ ఇద్దరి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఘోరం.. బస్సుపై తెగిపడిన కరెంటు తీగ.. ప్రయాణికుల సజీవదహనం

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాజీపుర్‌ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్‌ కరెంట్‌ వైరు (High Tension Wire) తెగి పడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొనసాగుతున్న క్రిప్టో ర్యాలీ.. బిట్‌కాయిన్‌ @ 71,000 డాలర్లు

ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ తొలిసారి 71,000 డాలర్ల మార్క్‌ను దాటింది. కాయిన్‌డెస్క్‌ వివరాల ప్రకారం సోమవారం ఓ దశలో 71,263.78 డాలర్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత 24 గంటల్లో దాదాపు 2.5 శాతానికి పైగా లాభపడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రొ.సాయిబాబాకు సుప్రీంలో ఊరట.. విడుదలపై ‘స్టే’కు నిరాకరణ

దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాకు భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని మహారాష్ట్ర చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని