Surya Kiran: ‘సత్యం’ దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత

నటుడు, దర్శకుడు సూర్య కిరణ్‌ (surya kiran) కన్నుమూశారు. గత కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు.

Updated : 11 Mar 2024 15:01 IST

చెన్నై: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు సూర్య కిరణ్‌ (surya kiran) కన్నుమూశారు. గత కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. తెలుగులో సుమంత్‌ హీరోగా నటించిన ‘సత్యం’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీ ఇద్దరి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. సూర్యకిరణ్‌ ‘మాస్టర్‌’ సురేష్‌ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాల నటుడిగా చేశారు. ఆ తర్వాత సహాయ నటుడిగానూ పలు చిత్రాల్లో కనిపించారు.

బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించారు. ‘సత్యం’ తర్వాత ‘ధన 51’, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజు భాయ్‌’, ‘చాప్టర్‌-6’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బిగ్‌బాస్‌సీజన్‌-4లోనూ కంటెస్టెంట్‌గా పోటీపడ్డారు. సూర్యకిరణ్‌ టి.ఎస్‌.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. సూర్య కిరణ్‌ సోదరి సుజిత కూడా నటే. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. కథానాయిక కల్యాణిని సూర్యకిరణ్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని