Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 13 Mar 2024 17:00 IST

1. 14న తెదేపా అభ్యర్థుల రెండో జాబితా: చంద్రబాబు

తెదేపా అభ్యర్థుల రెండో జాబితాను గురువారం విడుదల చేయనున్నట్టు అధినేత చంద్రబాబు తెలిపారు. కసరత్తు తుది దశకు చేరుకుందని, వీలైనంతమంది మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన, భాజపా ఏఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని, సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మంత్రి అంబటికి సత్తెనపల్లి టికెట్‌ ఇస్తే ఓడిస్తాం: అసమ్మతి నేతలు

మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని వైకాపా అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్ యాదవ్‌తో ఈ అంశంపై సీఎం జగన్‌ చర్చించినట్టు సమాచారం. నేతలతో చర్చించిన అనంతరం సత్తెనపల్లి టికెట్‌ అంబటికి ఇవ్వాలా? వద్దా? అనేది జగన్ నిర్ణయిస్తారని తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు: ఆరూరి రమేశ్‌

తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, భారాస నేత ఆరూరి రమేశ్‌ తెలిపారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ వచ్చినట్టు చెప్పారు. భారాసలోనే ఉన్నానని, మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవలేదని స్పష్టం చేశారు. ఆరూరి రమేశ్‌ పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను.. కేసీఆర్‌ పిలిపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మహిళలకు ఏడాదికి రూ.లక్ష.. ఉద్యోగాల్లో 50% కోటా: కాంగ్రెస్‌ హామీ

లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections 2024) దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ (Congress) పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష నగదును బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మార్చి 18న శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

శ్రీవారి దర్శనానికి జూన్‌ నెల కోటా టికెట్లను తితిదే త్వరలో విడుదల చేయనుంది. మార్చి 18 ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్‌ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22న మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పులి తిరిగివచ్చింది: పంత్‌కు దిల్లీ ఘనస్వాగతం

పంత్‌కు దిల్లీ జట్టు ఘన స్వాగతం పలికింది. ‘‘పులి తిరిగివచ్చింది.. గర్జించడానికి సిద్ధంగా ఉంది. రిషభ్‌ పంత్‌కు తిరిగి స్వాగతం. నిన్ను చూసేందుకు ఇక వేచి ఉండలేం’’ అంటూ ఎక్స్‌లో అతడి ఫొటోను పంచుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘డెవిన్‌’

సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం.. కృత్రిమ మేధ (Artificial Intelligence) ప్రతి రంగంలోనూ అడుగుపెడుతోంది. యాంకర్‌గా మారి వార్తలు చదవడం దగ్గర నుంచి విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం లాంటి ఎన్నో పనులు చేసేస్తోంది. తాజాగా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సూచీలు ఢమాల్‌.. రూ.13 లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 1100 పాయింట్లకు పైగా నష్టపోయి చివరికి 900 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ 22 వేల దిగువకు చేరింది. ముఖ్యంగా రిలయన్స్‌, ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌టీ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సోదరుడితో అన్ని బంధాలు తెంచుకున్నా : మమతా బెనర్జీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై అసహనం వ్యక్తంచేస్తూ మాట్లాడిన బాబుల్‌ బెనర్జీపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అతనితో అన్ని బంధాలను తెంచుకున్నట్లు తెలిపారు. దీదీకి సోదరుడైన బాబుల్‌.. భాజపాతో సన్నిహితంగా ఉన్నట్లు టీఎంసీ భావిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అదే జరిగితే అణు యుద్ధం తప్పదు.. అమెరికాకు పుతిన్‌ వార్నింగ్‌

ఉక్రెయిన్‌ (Ukraine)కు మద్దతుగా అమెరికా (USA) సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 15-17 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని