AI software engineer: ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘డెవిన్‌’

AI software engineer: అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ కాగ్నిషన్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని రూపొందించింది. దానికి సంబంధించిన విషయాలను తన బ్లాగ్‌ ద్వారా వెల్లడించింది.

Updated : 13 Mar 2024 16:41 IST

AI software engineer | ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం.. కృత్రిమ మేధ (Artificial Intelligence) ప్రతి రంగంలోనూ అడుగుపెడుతోంది. యాంకర్‌గా మారి వార్తలు చదవడం దగ్గర నుంచి విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం లాంటి ఎన్నో పనులు చేసేస్తోంది. తాజాగా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.

అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ కాగ్నిషన్‌ (Cognition) కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘డెవిన్‌‘ (Devin) రూపొందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఆవిష్కరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కంపెనీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘డెవిన్‌’ అత్యాధునికమైనదని, ప్రముఖ ఏఐ కంపెనీల నుంచి ప్రాక్టికల్‌ ఇంజినీరింగ్‌ ఇంటర్య్వూలను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. ‘‘ఒక ప్రాంప్ట్‌ ఇస్తే చాలు అలవోకగా కోడ్‌ రాసేస్తుంది. వెబ్‌సైట్లను క్రియేట్‌ చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను సృష్టిస్తుంది’’ అని కంపెనీ పేర్కొంది.

పేటీఎం షేర్లను పూర్తిగా విక్రయించిన 6 మ్యూచువల్‌ ఫండ్లు!

కష్టమైన ఇంజినీర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన ప్లాన్‌లు అమలుచేయగల అద్భుతమైన సామర్థ్యం ‘డెవిన్‌’కు ఉందని కంపెనీ వెల్లడించింది. సొంత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే కాకుండా తన తప్పుల్ని తానే సరిదిద్దగలదని తెలిపింది. యూజర్ల ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని వారి అభిరుచి మేరకు మెరుగైన సేవలు అందిస్తుందని, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రపంచంలో ఇది గేమ్ ఛేంజర్ కానుందని తెలిపింది. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను తీసుకురావడంపై కంపెనీ స్పందించింది. ఉద్యోగులను ఏఐ ఇంజినీర్లతో భర్తీ చేయాలనే ఉద్దేశం తమకు లేదని కేవలం వారి పనుల్ని సులభతరం చేయడంలో భాగంగా మాత్రమే దీన్ని రూపొందించామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని